Alalu Kadilina Pate Song Lyrics
Directed:K.Viswanath
Produced:Murari – Naidu
Starring:Talluri Rameshwari,Chandra Mohan,Sridhar
Music:K.V. Mahadevan
Lyrics:Veturi
Singers:Susheela,Vani Jayaram
అలలు కదిలినా పాటె సాంగ్ లిరిక్స్ సీతామాలక్ష్మి మూవీ ఇన్ తెలుగు
అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను… బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను… బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను…
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..
ఆ సుప్రభాతాలు… ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు …మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను…
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన దశరథ తనయ లాలీ
ఆ… రామలాలికి.. ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి… ఈ లాలికీ..
ఏ పాట నే పాడను… బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను…
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ..ఎందుకో…నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో… నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే
ఎందుకో ..ఎందుకో…నా మీద అలిగాడు చెలికాడు…
కలలు చెదిరినా పాటే… కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను…
Alalu Kadilina Pate Song Lyrics From Seetha Maalaxmi Movie In Telugu
Alalu kadhilinaa paate aaku medhilinaa paate
Kalalu chedhirinaa paate kalatha chendhinaa paate
Ye patane padanu bruthuke pataina pasivadanu
Ye patane padanu bruthuke pataina pasivadanu
Ye pata ne padanu
Yelukunte pata melukunte pata
Padukunte pata ma devudu
Yelukunte pata melukunte pata
Padakunte pata ma devudu
Sreemannabeesta varadhakila lokabandho
Sree srenivasa jgadeka dhayaika sindho
Sree devathagruha bujanthara dhivyamoorthe
Sri venkataachalapathe thava suprabatham
Aa suprabathalu aa bakthi geethalu
Padakunte melukodu mammelukodu
Ye pata ne padanu
Thalladille vela thalli pade jola
Palakanna theepi papayiki
Thalladille vela thalli pade jola
Palakanna theepi papayiki
Ramalaali meghasyamalaali
Thamarasa nayana dhasaradha thanaya laali
Ramalaali meghasyama laali
Thamarasa nayana dhasaradha thanaya laali
Aa ramalaaliki aa prema geethiki
Ramudaina papa illaliki ee laliki
Yepata ne padanu brathuke pataina pasivadanu
Ye pata ne padanu
Cheruvaina hrudhayalu dhooramaithe pata
Janta basina guvva vonti brathuke pata
Endhuko endhuko na meedha aligadu chelikadu
Endhuko na meedha aligadu chelikadu
Edhuruchusinachoopu chukkalaina radu
Nidhura kahina kanta kala ayina kaledu
Edhuruchusinachoopu chukkalaina radu
Garaalu neeraye theeralu veraaye
Manasu meeralaye vayaseti palaye
Endhuko endhuko na meedha aligadu chelikadu
Kalalu chedhirina paate kalatha chendina paate
Ye pata ne padanu
Vedio Song