Vidhata Talapuna Song Lyrics From Sirivennela Movie In Telugu

Vidhata Talapuna Song Lyrics From Sirivennela Movie In Telugu
Vidhata Talapuna Song Lyrics From Sirivennela Movie In Telugu

Vidhata Talapuna Song Lyrics
Director:K.Viswanath
Producer:Ch.Ramakrishna Reddy,N.Bhaskara Reddy,U.Chinaveerraju
Music:K.V.Mahadevan
Starring:Sarvadaman Banerjee,Suhasini,Meena,Samyuktha Varma
Singers:S.P.Balasubrahmanyam,P.Susheela
Lyrics:Sirivennela

విధాత తలపున సాంగ్ లిరిక్స్ సిరివెన్నెల మూవీ ఇన్ తెలుగు

విధాత తలపున ప్రభవించినది… అనాది జీవన వేదం…
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం…
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం…
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం… ఈ గీతం…
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం…

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన

జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిలకిల స్వనముల…
స్వరగతి జగతికి శ్రీకారము కాగా

విశ్వకావ్యమునకిది భాష్యముగా…
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం…

జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం

చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం.. ఆదితాళమున.. అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే..

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం…
నా ఉఛ్వాసం కవనం… నా నిశ్వాసం గానం

నా ఉఛ్వాసం కవనం… నా నిశ్వాసం గానం
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం… ఈ గీతం…

Vidhata Talapuna Song Lyrics From Sirivennela Movie In Telugu

Vidhatha thalapuna prabavinchindhi..anadhi jeevana vedham
Prana nadulaku spandhana nosaginaaadhi pranavanadham
Kanula kolanulo prathibinbinchina viswaroopa vinyasam

Yadha kanumalalo prathidvaninchina virinchi vipanchi ganam
Sarasaswara sura jaree gamanamou saamavedha saramidhi
Sarasaswara sura jaree gamanamou saamavedha saramidhi

Ne padina jeevana geetham ee geetham
Virinchinai virachinchithini ee kavanam
Vipanchinai vinipinchithini ee geetham

Pragdisha veeniyapaina dhinakara mayooka thanthrulapaina
Jagrutha vihanga thathule vineela gaganapu vedhika paina
Palikina kila kila swanamula

Swaragathi jagathiki sreekaramu kaagaa
Viswakavyamunakidhi bashyamuga
Virinchinai virachinchithini ee kavanam

Vipanchinai vinipinchithini ee geetham
Janinchu prathi sishu galamuna palikina jeevana nadha tharangam
Chethana pondhina spandhana dvaninchu hrudhaya mrudanga dhyanam

Anadhi ragam aadhi thalamuna ananatha jeevana vahinigaa
Saagina srusti vilaasamune
Virinchinai virachinchithini ee kavanam

Vipanchinai vinipinchithini ee geetham
Naa uchvasam kavanam na niswasam ganam
Naa uchvasam kavanam na niswasam ganam

Sarasaswara sura jaree gamanamou saamavedha saramidhi
Ne padina jeevana geetham ee geetham

Vedio Song

Leave a Comment