Sirivennela Song Lyrics
Directed:Rahul Sankrityan
Producer:Venkat S Boyanapalli
Singer:Anurag Kulkarni
Starring:Nani,Sai Pallavi,Krithi Shetty
Music:Mickey J Meyer
Lyrics:Sirivennela Seetharama Sastry
సిరివెన్నెల సాంగ్ లిరిక్స్ శ్యామ్ సింఘా రాయ్ మూవీ ఇన్ తెలుగు
నెల రాజుని ఇల రాణి ని కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నది రాతిరిలో తెరలు తెరచి నది నిద్దురలో
మగత మరిచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదట కల
తన నవ్వులలో తలుకు తలుకు
తన చెంపలలో చెమకు చెమకు
తన మువ్వలలో జనకుజనకు సరి కొత్త కల
ఓ ఛాంగురే ఇంతటిదా నాసిరి అన్నది ఈ శారద రాతిరి
మిల మిల చెలి కన్నుల తన కళలను కనుగొని
అచ్చెరువున మురిసి అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా సరి సృష్టికే అర్థము చూపగా
పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నేలకు జరిగిన పరిచయమే
తెర దాటి చేర దాటి వెలుగు చూస్తున్న భామని
సరి సాటి ఎద మీటి పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ పులకరిస్తుంది యామిని
కలబోసి ఊసులు విరబూసే ఆశలై
నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవల
మౌనాలే మమతాలై మధురాలా కవితలే
తుది చేరని కబురులు కధాకళీ కదిలినా
రేపటి కధలకు మున్నుడిలా
తన నవ్వులలో తలుకు తలుకు
తన చెంపలలో చెమకు చెమకు
తన మువ్వలలో జనకుజనకు సరి కొత్త కల
ఇదిలా అని ఎవరైనా చూపనే లేదు కంటికి
అదెలాగో తనకైనా తోచని లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన సంకోచం మెరిసిన
ఆ రెంటికీ మించిన పరవశం లీలను
కాదని అనగలమా కథ కదిలే వరుసన
తమ యదలే తడిసిన గత జన్మల పొడవునా
దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా
తన నవ్వులలో తలుకు తలుకు
తన చెంపలలో చెమకు చెమకు
తన మువ్వలలో జనకుజనకు సరి కొత్త కల
Sirivennela Song Lyrics From Shyam Singha Roy Movie In Telugu
Nela rajuni ila raani ni kalipindi kadha sirivennela
Dhooramaa dhooramaa theeramai cherumaa
Nadi rathirilo theralu terachi nadhi niddhuralo
Magatha marichi udayinchinada
Kilukuloluku cheli modtai kala
Thana navvulalo thaluku thaluku
Thana chempalalo chemaku chemaku
Thana muvvalalo jhanaku jhanaku sari kottha kala
O changure inthatida naasiri annadi ee sharada rathiri
Mila mila cheli kannula thana kalalanu kanugoni
Accheruvuna murisi ayyaho enthatidee sundari
Evvaru raaru kadha sari srustike ardamu choopaga
Puttinademo naari sukumaari
Idi ningiki nelaki jarigina parichayame
Thera dati chera dati velugu choosthunna bamani
Sari saati edha meeti palakaristhunna shyamuni
Priyamaara gamanisthu pulakaristhondhi yamini
Kalabose oosule viraboose aashalai
Navarathiri poosina vekuva rekhalu rasinadhee navala
Mounale mamathalai madurala kavithalai
Thudi cherani kaburula kadhakali kadilina
Repati kadhalaku munnudilaa
Thana navvulalo thaluku thaluku
Thana chempalalo chemaku chemaku
Thana muvvalalo jhanaku jhanaku sari kottha kala
Idilaa ani evarainaa chupane ledhu kantiki
Adelago thanakaina thochane ledhu maataki
Ipudipude manasaina repu dorikindi choopuki
Santhosham sarasana sankocham merisina
Aa rentiki minchina paravasha leelanu
Kaadani anagalamaa katha kadile varasana
Thama yadale thadisinaa gatha janmala podavuna
Dachina dahamu ipude veeriki parichayamaa
Thana navvulalo thaluku thaluku
Thana chempalalo chemaku chemaku
Thana muvvalalo jhanaku jhanaku sari kottha kala