Samsaram Song Lyrics
Directed:S.P.Muthuraman
Produced:M.Saravanan,M.Balasubramanian
Music:Chakravarthy
Singer:S.P.Balasubrahmanyam
Starring:Gollapudi Maruthi Rao,Sarath Babu,Rajendra Prasad,Suhasini
సంసారం సాంగ్ లిరిక్స్ సంసారం ఒక చదరంగం మూవీ ఇన్ తెలుగు
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో, సాగేటి ఆటలో,
ఆవేశాలు… ఋణపాశాలు… తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
గుండెలే.. బండగా.. మారిపోయేటి స్వార్ధం
తల్లినీ.. తాళినీ.. డబ్బుతో తూచు బేరం
రక్తమే.. నీరుగా.. తెల్లబోయేటి పంతం
కంటికీ.. మంటికీ.. ఏకధారైన శోకం
తలపై విధి గీత, ఇల పైనే వెలసిందా
రాజులే బంటుగా మారు ఈ క్రీడలో,
జీవులే పావులైపోవు ఈ కేళిలో
ధనమే తల్లి.. ధనమే తండ్రి.. ధనమే దైవమా
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
స్వార్ధాల మత్తులో, సాగేటి ఆటలో,
ఆవేశాలు… ఋణపాశాలు… తెంచే వేళలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
కాలిలో.. ముల్లుకీ.. కంట నీరిచ్చు కన్ను,
కంటిలో.. నలుసునీ.. కంట కనిపెట్టు చెల్లీ
రేఖలు.. గీతలు.. చూడదీ రక్తబంధం,
ఏ పగా చాలదు ఆపగా ప్రేమ పాశం
గదిలో ఇమిడేనా మది లోపల మమకారం
పుణ్యమే.. పాపమై.. సాగు ఈ పోరులో
పాపకే పాలు కరువైన పట్టింపులో
ఏ దైవాలు కాదంటాయి ఎదలో ప్రేమని
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
ప్రాణాలు తీసినా, పాశాలు తీరునా,
అదుపు లేదు.. ఆజ్ఞ లేదు.. మమకారాలలో
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక రణరంగం
కౌగిలే.. కాపురం.. కాదులే పిచ్చి తల్లీ,
మల్లెల.. మంచమే.. మందిరం కాదు చెల్లీ
తేనెతో.. దాహము.. తీర్చదేనాడు పెళ్లి
త్యాగమే.. ఊపిరై.. ఆడదయ్యేను తల్లి
కామానికి దాసోహం, కారాదే సంసారం
కాచుకో.. భర్తనే.. కంటి పాపాయిగా,
నేర్చుకో.. ప్రేమనే.. చంటి పాపాయిగా,
మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక గుణపాఠం
ప్రేమే సంసారము, ప్రేమే వేదాంతము,
వయసు కాదు.. వాంఛా కాదు.. మనసే జీవితం
సంసారం ఒక చదరంగం… అనుబంధం ఒక గుణపాఠం
చుక్కలు.. జాబిలి.. చూసి నవ్వేది కావ్యం
నింగికే.. నిచ్చెన.. వేసుకుంటుంది బాల్యం
తారపై.. కోరిక.. తప్పురా చిట్టి నేస్తం
రెక్కలే.. రానిదే.. ఎగరనేలేదు భ్రమరం
వినరా ఓ సుమతీ, పోరాదు ఉన్న మతి!!
పాత పాఠాలనే దిద్దుకో ముందు
Samsaram Song Lyrics From Samsaram Oka Chadarangam Movie In Telugu
Samsaaram oka chadharangam anubandham oka rana rangam
Swardhala matthulo saageti aatalo
Aaveshaalu runapaashaalu thenche velalo
Samsaaram oka chadharangam anubandham oka rana rangam
Gundele bandagaa maaripoyeti swardham
Thallini thalini dabbutho thooch beram
Rakthame neerugaa thellaboyeti pantham
Kantiki mantiki ekadhaaraina shokam
Thalapi vidhi geetha ilapaine velasindhaa
Rajule bantugaa maaru kreedalo
Jeevule paavulapove ee kelilo
Dhaname thalli dhaname thandri dhaname dhaivamaa
Samsaaram oka chadharangam anubandham oka rana rangam
Swardhala matthulo saageti aatalo
Aaveshaalu runapaashaalu thenche velalo
Samsaaram okachadharangam anubandham oka rana rangam
Kaalilo mulluki kanta neericchu kannu
Kantilo nalusunee kanta kanipettu chelli
Rekalu geethalu choodadhee raktha bandham
Ye pagaa chaladhu aapagaa prema paasham
Gadhilo imidenaa madhi lopala mamakaaram
Punayame paapamai saagu ee porulo
Paapake paalu karuvaina pattimpulo
Ye dhaivaalu kadhantaayi yadhalo premani
Samsaaram okachadharangam anubandham oka rana rangam
Praanaalu theesinaa paahaalu theerunaa
Adhupu ledhu aagna ledhu mamakaaraalalo
Samsaaram oka chadharangam anubandham oka rana rangam
Kougile kaapuram kadhule picchi thalli
Mallela manchame mandhiram kadhu chelli
Thenetho dhahamu theerchadhenadu pelli
Thyagame oopirai aadadhayyenu thalli
Kaamaaniki dhasoham kaaradhe samsaaram
Kachuko barathane kanti paapaayigaa
Nerchuko premane chanti paapaayigaa
Manninchedhi manasicchedhi magade sodhari
Samsaaram oka chadharangam anubandham oka guna paatam
Preme samsaaramu preme vedhanthamu
Vayasu kadh vanchaa kadhu manase jeevitham
Samsaaram oka chadharangam anubandham oka guna paatam
Chukkalu jabili choosi navvedhi kavyam
Ningike nicchena vesukuntundhii balyam
Tharapai korika thappuraa chitti nestham
Rekale raanidhe egaraneledhu bramaram
Vinaraa o sumati poraadu unna mathi
Patha paataalane dhiddhuko mundhu
Vedio Song