Kadilindi Karuna Radham Song Lyrics From Karunamayudu Movie In Telugu

Kadilindi Karuna Radham Song Lyrics From Karunamayudu Movie In Telugu
Kadilindi Karuna Radham Song Lyrics From Karunamayudu Movie In Telugu

Kadilindi Karuna Radham Song Lyrics
Directed:A.Bhimsingh
Produced:Vijayachander
Starring:Vijayachander,Kongara Jaggaiah
Music:Joseph Fernandez,B. Gopalam,
Lyrics:M.Jansan,Gopi,Sri Sri
Singer:Balu

కదిలింది కరుణ రధం సాంగ్ లిరిక్స్ కరుణామయుడు మూవీ ఇన్ తెలుగు

కదిలింది కరుణరధం ..సాగింది క్షమాయుగం
మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపధం
కదిలింది.. కరుణరధం ..సాగింది.. క్షమాయుగం

మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగె కాంతిపధం మనుషులు చేసిన పాపం..
మమతల భుజాన ఒరిగిందీ..

పరిశుద్ధాత్మతో పండిన గర్భం..
వరపుత్రునికై వగచింది.. వగచిందీ..
దీనజనాళికై దైవకుమారుడు..

పంచిన రొట్టెలే.. రాళ్ళైనాయి..
పాప క్షమాపణ పొందిన హృదయాలు..
నిలివున కరిగీ.. నీరయ్యాయి.. నీరయ్యాయి

అమ్మలార నా కోసం ఏడవకండి
మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి
ద్వేషం.. అసూయ.. కార్పణ్యం.. ముళ్ళ కిరీటమయ్యింది

ప్రేమా..సేవా..త్యాగం.. చెలిమి
నెత్తురై ఒలికింది.. ఒలికిందీ
తాకినంతనే స్వస్తత నొసగిన

తనువుపై కొరడా ఛెళ్ళందీ
అమానుషాన్ని అడ్డుకోలేని
అబలల ప్రాణం అల్లాడింది

ప్రేమ పచ్చికల పెంచిన కాపరి
దారుణ హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు

చెల్లాచెదరై కుమిలాయి
పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలూ
నెత్తురు ముద్దగ మారాయి

అభిషిక్తుని రక్తాభిషెకంతో
ధరణి ద్రవించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరిరాళ్ళు.. కలవరపడి..
కలవరపడి..కలవరపడి..అరిచాయి.. అరిచాయి

Kadilindi Karuna Radham Song Lyrics From Karunamayudu Movie In Telugu

Kadilindi karuna radham sagindhi kshamayugam
Manishi koraku dhaivame karigi velige kanthi padham
Kadilindi karuna radham sagindhi kshamayugam

Manishi koraku dhaivame manishi koraku dhaivame
Karigi velige kanthi padham manushulu chesina paapam
Mamathala bujana vorigindhi

Parishuddhathmatho pandina garbham
Vara puthrunikai vagachindi vagachindi
Dheena janalikai dhaiva kumarudu

Panchina rottele raallainayi
Paapa kshamapana pondhina hrudayaalu
Niluvuna karigi neerayyayi neerayyayi

Ammalaara naakosam edavakandi
Meekosam mee pillala kosam edavandi
Dvesham asooya karpanyam mulla kireetamayindhi

Prema seva thyagam chelimi
Netthurai volikindi volikindi
Thakinanthane swasthatha nosagina

Thanuvupai korada chellandi
Amanushanni addukoleni
Abalala pranam alladindhi

Prema pacchikala penchina kapari
Dharuna himsaku gurikaga
Chediripoyina mooga gorrelu

Chella chedharai kumilaayi
Parama vaidhyuniga paradina pavithra padhalu
Netthuru muddhaga marayi

Abishikthuni rakthabishekamtho
Dharani dravinchi muddadindhi
Shiluvanu thakina kalvari rallu..kalavarapadi
Kalavarapadi kalavarapadi arichayi arichayi

Vedio Song

Leave a Comment