Em Pillado Eldamostava
చిత్రం : అర్ధరాత్రి స్వతంత్రంం (1986)
సాహిత్యం : వంగపండు
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : వంగపండు
ఎం పిల్లాడో ఎల్దామోస్తావా సాంగ్ లిరిక్స్ ఫ్రొం అర్ధరాత్రి స్వతంత్రం (1986) మూవీ ఇన్ తెలుగు
ఏం పిల్లడో ఎల్దమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
శ్రీకాకుళంలో సీమ కొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
అరె సిలకలు ఓయ్ శిలకలు
అహ సిలకలు కత్తులు దులపరిస్తాయట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఒరే సాలూరవతల సవర్లకొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఎయ్ సెమర పిల్లులే శంఖమూదేనట
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఒరే నలగొండ నట్టడివిలోనికి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఒరే పాముని ఓయ్ పాముని
అహ పాముని పొడిచిన చీమాలున్నాయట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఒరే తెలంగాణా కొమరయ్య కొండకి
ఏం పిల్లో ఎల్దామోస్తవా
అరె గద్దని ఒహో గద్దని తన్నిన చేతులున్నాయట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఒరే ఆకులు మేసిన మేకల కొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఆ పులుల్ని అరె పులుల్ని అరె పులుల్ని
మింగిన గొర్రెలున్నాయట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఆ రాయలసీమ రాలు కొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
అరె రక్తం అరె రక్తం రాజ్యం యాళ్తుందట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఒరే తూరుపు అరే తూరుపు దిక్కున
దోర కొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
అరెరెరెరెరెరె హ హూ హా
అరెరెరెరెరెరె హ హూ హా
అరె తుపాకి ఓయ్ తుపాకీ అరె తుపాకీ పేల్చిన
తూరీగలున్నాయట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఒరే కలకత్తా కొస కారు కొండకి
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఒరే ఎలుకలు ఆ ఎలుకలు ఆ ఎలకలు
పిల్లిని ఎండాతగిలేనట
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా
ఏం పిల్లడో ఎల్దుమోస్తవా
ఏం పిల్లో ఎల్దామోస్తవా