Gaganamu Cheelchukoni Song Lyrics In Telugu

Gaganamu Cheelchukoni Song Lyrics In Telugu
Gaganamu Cheelchukoni Song Lyrics In Telugu

Gaganamu Cheelchukoni
Lyricist:Hosanna Ministries
Hosanna Ministries Kurnool

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగ రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని … నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగ రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా

నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది (2)
పవిత్రురాలైన కన్యక గా నీ యెదుటనే నేను నిలిచెదను (2)
నీ కౌగిలి లో నేను విశ్రమింతును (2).
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగ రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా

నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్నది – నీ వలె రూపించుచున్నది (2)
కళంకము లేని వధువు నై నిరీక్షణ తో నన్ను చేరెదను (2)
యుగ యుగాలు నీతో యేలెదను (2)
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగ రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా

నీ కృపా బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళిక తో సీయోను లో నీతో నే నుందును (2)
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోగ రానైయున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా

Leave a Comment