Ememi Puvvoppune Gowramma Song Lyrics In Telugu
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునేఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
జిల్లేడు పువ్వోప్పునే గౌరమ్మ జిల్లేడు కాయెుప్పునే
జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (4)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
మందార పువ్వోప్పునే గౌరమ్మ మందార కాయెుప్పునే
మందార పువ్వులో మందార కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
గుమ్మడి పువ్వోప్పునే గౌరమ్మ గుమ్మడి కాయెుప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (5)
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే
గన్నేరు పువ్వోప్పునే గౌరమ్మ.. గన్నేరు కాయెుప్పునే
గన్నేరు పువ్వులో గన్నేరు కాయలో Ememi Puvvoppune
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో (6)
బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట ప్రతి వీధిలోనూ మారుమోగుతూనే ఉంటుంది.