2024 Bathukamma Songs
1. ఎన్నడులేనిది నిండుగా పూసినయో
ఎన్నడులేనిది నిండు పున్నమోలే నిండుగా పూసినయో..
రామా అయ్యో రామా అయ్యో నై రామా..
సింగిడార పోసినట్టు నేల మీద రంగుల రాసులమ్మో..
రామా అయ్యో రామా అయ్యో నై రామా..
ప్రకృతి అందాలు పడతి ఆనందాలు కలబోసి విరబూసే పూల పండగ.
2. బతుకమ్మ పండుగొచ్చే
బతుకమ్మ పండుగొచ్చే ఆటలాడుకుందామా పాట పాడుకుందామా..
పాట పాడుకుందమా గౌరమ్మను వేడుకుందామా..
ఆడబిడ్డల పండగొచ్చే పల్లెను తలచుకుందామా
చెల్లెలు పిలుచుకుందామా..చెల్లెలు పిలుచుకుందామా ప్రేమలు పంచుకుందామా
3. గుమ్మరే గుమ్మా గుమ్మా
గుమ్మరే గుమ్మా గుమ్మా గునుగు పూల జాతరా..
తంగేడు తామరలు తల్లీ నీ చుట్టూరా..
కానలో కొమ్మారెమ్మ కోరి పూలు పంపగా..
వంతపాడుతూ మురిసె వనితలు నిను ఊరూరా.
4. హే పుట్టినాదే పువ్వులల్లో
హే పుట్టినాదే పువ్వులల్లో..
పెరిగినాదే మట్టి మనుషుల చేతులల్లో.. బతుకమ్మయ్యి..
ఓ రామ రామయ్యలో..
హే నేల దిగిన నెలవంక నెత్తి మీద పొడిచినట్టు ఎత్తుకున్న బతుకమయ్యి
ఓ రామ రామయ్యలో..
5. ఓ శివుని గుమ్మ ఊరువాడ విలిసినాదే
పూల శిలకు పురుడు పోసెనే పులే దారిలో..పేరు
పెట్టి జోల వాడెనే నగాదారిలో..గావురంగ
తీర్చిదిద్దెనే పులే దారిలో..ఆడబిడ్డలాగా
పెంచెనే నగాదారిలోఓ శివుని గుమ్మ ఊరువాడ
విలిసినాదే..ఓ పూలకొమ్మ శిప్పి నిన్ను విలిసినాదే.
6. మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో
మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో..
ఓ మామగారు ఉయ్యాలో..
ఈ పువ్వు పేరేమి ఉయ్యాలో..
చెప్పరాదు మామ ఉయ్యాలో..
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో..
నాకు తెల్వబోదే ఉయ్యాలో..
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో..
మీ అత్తనడుగే ఉయ్యాలో.